కోవిడ్ -19 జాతి లో 73 రూపాలు  

కోవిడ్ -19లో ఎన్నిరకాల రూపాలున్నాయనేదానిపై ఢిల్లీలోని సిఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) తోపాటు భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఎస్ యూఎం హాస్పిటల్ కు చెందిన పరిశోధనా బృందం కనుగొంది. 

వీరి పరిశోధనలో కోవిడ్ -19 జాతి లో 73 రూపాలున్నట్లు ఒడిశాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఈ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు. “752 క్లినికల్ శాంపిల్స్‌తో సహా 1,536 నమూనాలను పరిశీలించిన పరిశోధన బృందం బి .1.112 , బి 1 అనే రెండు వంశాలున్నట్లు వెల్లడించింది

. “కరోనావైరస్ వివరణాత్మక పాత్రను గుర్తించడం ద్వారా రోగులకు చికిత్స చేయడం చాలా సులభం అని” జయశంకర్ దాస్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) మద్దతుతో పరిశోధన బృందం అత్యంత అధునాతన కోవిడ్ -19 సీక్వెన్సింగ్ టెక్నాలజీని ధృవీకరించింది. 

SARS-CoV-2  జన్యు ఎపిడెమియాలజీని ఎనేబుల్ చేసే అదనపు ప్రయోజనంతో SARS-CoV-2 ను గుర్తించడానికి ఇది అధిక సున్నితత్వ పరీక్ష కావచ్చని దాస్ చెప్పారు. 

ఈ అధ్యయనంతో భారతదేశం 10 దేశాలలో 12 సంస్థలను ఓడించి, మొదటి ఫీల్డ్ ధ్రువీకరణను పూర్తి చేసి డేటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసిందని దాస్ పేర్కొన్నారు. సూక్ష్మ క్రిముల అమరికను కనుగొనడం ద్వారా దాని బలహీనతలను తెలుసుకొని అవసరమైన చికిత్స ఇవ్వొచ్చని ఆయన వివరించారు.