ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో సీనియర్ న్యాయవాది  ప్ర‌శాంత్ భూష‌న్ దోషిగా తేలారు. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోన్డేతో పాటు సుప్రీంకోర్టుపై ఇటీవ‌ల అనుచిత ట్వీట్లు చేసిన కేసులో ఆయ‌న్ను అత్యున్న‌త నాయ‌స్థానం త‌ప్పుప‌ట్టింది. అయితే ఈ కేసులో ఆగ‌స్టు 20వ తేదీన శిక్ష‌ను సుప్రీంకోర్టు ఖ‌రారు చేయ‌నున్న‌ది. 

అరుణ్ మిశ్రా, బీఆర్ గ‌వాయి, కృష్ణ‌మురారీల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మానం ఈ తీర్పును ఇచ్చింది. ఆగ‌స్టు 3వ తేదీన జారీ చేసిన అఫిడ‌విట్‌లో లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌న వివాదాస్పద ట్వీట్ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఆ క్ష‌మాప‌ణ‌ల‌ను తిర‌స్క‌రించింది. సుప్రీం న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించినంత మాత్రాన యావ‌త్ కోర్టును త‌ప్పుప‌ట్టిన‌ట్లు కాద‌ని భూష‌ణ వాదించారు.

లాక్‌డౌన్ వేళ సీజే బోబ్డే ఓ సూప‌ర్‌బైక్‌తో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. అప్పుడు దానిపై భూష‌ణ్ అనుచిత వాఖ్యలు  చేశారు. చీఫ్ జ‌స్టిస్ ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేద‌ని భూష‌ణ్ త‌న ట్వీట్లో ప్ర‌శ్నించారు. 

అయితే బైక్ స్టాండ్‌పై ఉన్న‌ద‌ని, ఆ స‌మ‌యంలో హెల్మెట్ అవ‌స‌రం లేద‌ని, కానీ స్టాండ్‌పై ఉన్న బైక్‌పై సీజే ఉన్న‌ట్లు తాను గుర్తించ‌లేద‌ని, అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు ప్ర‌శాంత్ గ‌త అఫిడ‌విట్‌లో తెలిపారు.  సుప్రీం కోర్టు తీరు ప‌ట్ల కూడా ప్ర‌శాంత్ వివాదాస్ప‌ద ట్వీట్ ఛేశారు. 

న్యాయ‌మూర్తుల‌ను ఆయ‌న త‌ప్పుప‌డుతూ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌ర‌పున న్యాయ‌వాది దుశ్యంత్ దావే వాదించారు. ప్ర‌శాంత చేసిన రెండు ట్వీట్లు సుప్రీం వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా లేవ‌ని పేర్కొన్నారు. కొంద‌రు జ‌డ్జిల వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న‌ను ఉద్దేశిస్తూ ప్ర‌శాంత్ కామెంట్ చేశార‌ని తెలిపారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను విమ‌ర్శించిన ప్ర‌శాంత్ భూష‌ణ్‌పై సుప్రీం సుమోటో కేసును స్వీక‌రించింది