కేసీఆర్ ఇలాకాలోనే దిక్కులేని హామీలు 

పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం, తర్వాత వాటి గురించి పట్టించుకొనక పోవడం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పరిపాటి. చివరకు తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో సహితం అదే వరవడి అనుసరిస్తున్నారు. 
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తూప్రాన్ మున్సిపాలిటీలో రెండు పడకల  ఇళ్ల నిర్మాణాలకు 2018లో ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం కోసం సీఎం కేసీఆర్  తూప్రాన్‌‌‌‌కు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన పేదల కోసం 500 రెండు పడకల ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
వాటిని ఏడాది లోపు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లు పూర్తయినా ఇంకా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. సీఎం హామీ ఇచ్చిన కొన్నాళ్లకే ఇండ్లు మంజూరు మంత్రి హరీశ్‌ రావు, మెదక్
ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇద్దరు కలిసి ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన అయితే చేశారు. 
 
ఆ తర్వాత కొద్ది రోజులకు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. కానీ పనులు నత్త నడకన సాగుతుండడంతో దాదాపు రెండేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ఇండ్లు పూర్తి కాలేదు. 
 
ఇప్పటికి సుమారు 200 ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా, మరో 300 ఇళ్లు పిల్లర్లు,స్లాబ్ల్ లెవల్లోనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నసెగ్మెంట్‌‌‌‌లోనే రెండు పడకల ఇళ్ల నిర్మాణం తీరు ఇలా ఉండడం గమనార్హం.