భారత్ లోనే లిథియం అయాన్ బ్యాటరీలు 

విద్యుత్ వాహనాల తయారీలో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు, ఇతర సాంకేతిక పరికరాలను దిగుమతి అవసరం లేకుండా భారత్ లోనే తయారీ అయ్యేటట్లు చూస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. 

‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే విద్యుత్ వాహనాలలో వాడే పరికరాలను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ పరికరాలు అన్నింటినీ, ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలను భారత్ లోనే  తయారు చేయడమే మా ప్రధాన కర్తవ్యం’ అని ఈ–మొబిలిటీ కాంక్లే వ్‌కాంక్లేలో గడ్కారీ ప్రకటించారు. 

లిథియం అయాన్ మైన్లను రెండు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే ముడి పదార్ధాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అదేవిధంగా అందుకు అవసరమైన సాంకేతికతను కూడా అభివృద్ధి  చేస్తున్నామని చెప్పారు. 

సోడియం అయాన్ టెక్నాలజీపై కూడా తాముపరిశోధనలు చేస్తున్నట్టు వెల్లడించారు. లిథియం సెల్స్ ఈవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌‌ల రీఛార్బుల్ జ్‌ బ్యాటరీలకు బ్లాక్స్‌ను అభివృద్ధి చేస్తాయి. భారత్ లో  బ్యాటరీ మెటల్ దొరుకుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ సెల్స్ కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. 

లిథియం అయాన్ సెల్స్‌ను తక్కువ వ్యయంలో  అందుబాటులోకి తేవడానికి వీటిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని గతేడాదే ఆర్ధిక  మంత్రి నిర్మలా సీతారామన్ ఎత్తివేశారు. అంతర్జాతీయంగా  లిథియం అయాన్ సెల్ తయారీ‌‌లో చైనా ముందంజలో ఉంది. ఆ తర్వాత అమెరికా, థాయ్‌‌లాండ్, జర్మనీ, స్వీడన్, సౌత్‌ కొరియాలు ఉన్నాయి.