ఏపీలో ఒకేరోజు 10 వేలు దాటినా కరోనా కేసులు 

ఆంధ్ర ప్రదేశ్ లో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కేసులతో పాటు మరణాలు కూడా ప్రజలను వణికిస్తున్నాయి. అటు కేసులు, ఇటు మరణాలు ఏరోజుకారోజు రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఎన్నడు లేని విధంగా ఈ రోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 70,584 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 10,093 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఈరోజు 2,784 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 55,406 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63,771 యాక్టివ్ కేసులున్నాయి. 
బుధవారం ఒక్క రోజే 65 మందిని కొవిడ్ వల్ల మృతి చెందడంతోఇప్పటివరకు ఎపిలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 1213కి చేరింది. ఎపిలో ఇప్పటివరకు మొత్తం 18 లక్షల 20వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.  

 తూర్పుగోదావరి జిల్లాలో 1,676, అనంతపురం జిల్లాలో 1,371, గుంటూరు జల్లాలో 1,124, కర్నూలు జిల్లాలో 1,091, విశాఖ జిల్లాలో 841, చిత్తూరు జిల్లాలో 819, పశ్చిమగోదావరి జిల్లాలో 779, కడప జిల్లాలో 734, నెల్లూరు జిల్లాలో 608, శ్రీకాకుళం జిల్లాలో 496, కృష్ణా జిల్లాలో 259, ప్రకాశం జిల్లాలో 242, విజయనగరం జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి.