తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు 

తెలంగాణలో రోజు రోజుకూ కరోనా వేగంగా విస్తరిస్తుంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. టెస్ట్ చేయించుకుంటున్న ప్రతి వందలో కనీసరం 35 మందికి పాజిటివ్ వస్తుంది. కొన్ని టెస్టింగ్ సెంటర్లోనేతే యాభై శాతానికి పైగా పాజిటివ్ రేట్ నమోదవుతుంది. మూడు వారాల్లోనే మూడింతలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం తీవ్రతకు అద్దం పడుతోంది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఆదివారం నాటికి హెల్త్ బులెటిన్ లో ఇప్పటివరకూ 54,059 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కానీ, అదే ఆరోగ్య శాఖ ఇంటర్నల్ పోర్టల్ లెక్క ప్రకారం ఆదివారం సాయంత్రానికి కేసుల సంఖ్య 86 వేలకు చేరువైంది. 

ఇంకా పోర్టల్ లో అప్‌ లోడ్ చేయని కేసులు వేలల్లోనే ఉన్నట్లు అధికారులు  చెబుతున్నారు. 359 టెస్టింగ్ సెంటర్లలో రోజూ సగటున 15 వేల టెస్టులు చేస్తున్నారు. దీంతో టెస్టులు, వాటి రిపోర్టులు పోర్టల్ లో అప్లోడ్ చేయడం జాప్యం అవుతోంది. అప్లోడ్ చేసిన వాటిలోనే సుమారు 35 వేల కేసులను ఇప్పటికీ ప్రకటించలేదు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ వైరస్   కమ్యూనిటీలోకి చొచ్చుకుపోతుంది. పదిహేను రోజుల కిందటి దాకా 90 శాతం కేసులు గ్రేటర్‌   లోనే ఉండేవి. ఇప్పుడు రోజూ సగం కేసులు జిల్లాలేనే వస్తున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 1,593 కేసులు నమోదైతే, అరందులో 952 కేసులు జిల్లోలోనివే. 

వైరస్ ఎవరికి ఎట్ల అంటుకుంటుందో కూడా తెలవడం లేదు. రానున్న నాలుగైదు వారాల్లో పరిస్థితి మరింత సీరియస్ గా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఊళ్లలో కేసులు నమోదవుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తమ ఊరిలోకి ఎవరూ రావొద్దంటూ సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకుంటున్నారు.

కేసుల సంఖ్యతో పాటే మరణాలూ భారీగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి రోజూ 40 నుంచి 60 మంది చనిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. శ్మశాన వాటికల్లో దహనాలు, ఖననాలూ ఇదే చెబుతున్నాయి. చలి కాలంలో పరిస్థితి మరింత దిగజారుతందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.