భారీ వర్షంకు చెక్కుచెదరని 700 ఏండ్ల బౌద్ధ ఆలయం

మామూలుగా వ‌ర్షం ప‌డితే చాలు చెట్లు, పుట్ట‌లు క‌ద‌లిపోతాయి. వ‌ర్షం ఇంకాస్త పెద్ద‌దైతే ఇంటి ఇటుక‌లు అటూ ఇటూ క‌దిలి కూలిపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఎంత గ‌ట్టి క‌ట్ట‌డాలు అయినా పేక మేడ‌ల్లా కూలిపోతున్నాయి.

పెద్ద చ‌దువులు చ‌దివిన ఇంజినీర్లు క‌డుతున్న క‌ట్ట‌డాలు కొన్నేండ్ల‌కే కూలిపోతుంటే.. ఎప్పుడో 700 ఏండ్ల నాటి క‌ట్ట‌డం పెద్ద భారీ వ‌ర్షంలో కూడా చెక్కు చెద‌ర్లేదు అంటే అది ఎంత ప్ర‌త్యేక‌మో తెలుసుకోవాలి.

చైనాలోని ఉహాన్ యాంగ్జీ న‌దిలో ఓ రాతి దీపంపై 700 ఏండ్ల‌ కిందట నిర్మించిన బౌద్ధ ఆలయం ఈ వరదలను తట్టుకొని నిలబడింది. ఈ ఆల‌యాన్ని సాంగ్ రాజ‌వంశీకులు నిర్మించారు. ఆ త‌ర్వాత యువాన్ రాజ‌వంశీకులు దీన్ని పున‌ర్నిర్మించారు. 1998లో ఏర్ప‌డిన భారీ వ‌ర‌ద‌ల‌కు ఆ ఆల‌యం కొట్టుకుపోతుంది అనుకున్నారు

కానీ అనుకున్న‌ది ఏదీ జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత 2017, ఇప్పుడు తాజాగా ముంచెత్తిన వ‌ర‌ద‌ను త‌ట్టుకొని నిల‌బ‌డ‌డంతో  ఇక ఆల‌యానికి తిరుగే లేద‌నుకుంటున్నారు. ఎంతో వేగంగా ప్ర‌వ‌హిస్తున్న న‌దీ ప్ర‌వాహాన్ని త‌ట్టుకోవ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా నిలిచింది. నెటిజ‌న్లు అయితే ఈ ఆల‌యాన్ని ఇటుక‌ల‌కు బ‌దులుగా ఇనుముతో క‌ట్టిన‌ట్లు ఉన్నారని  అంటూ కొనియాడుతున్నారు.