కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు ఆయుధాలు తరలించే యత్నం

జ‌మ్ముక‌శ్మీర్‌లోకి భారీగా ఆయుధాల‌ను త‌ర‌లించేందుకు ఉగ్ర‌వాదులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని నిఘ‌వ‌ర్గాలు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. డ్రోన్లు, ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల ద్వారా క‌శ్మీర్‌లోకి భారీగా ఆయుధాలను చేర‌వేస్తున్న‌ట్లుపేర్కొన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల‌కు చొచ్చుకెళ్లేందుకు వ్య‌వ‌స్థ‌ల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు స‌మాచారం అందించాయి.

స‌రిహ‌ద్దుల్లోని నియంత్ర‌ణ రేఖ (ఎల్ఓసీ) లాంచ్‌ప్యాడ్ల వ‌ద్ద స‌మీక‌ర‌ణ‌ను పెంచుతున్న‌ట్లు తెలిపాయి. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్ర‌వాలు ఏక‌మై ఆయుధాల‌ను స‌మీ‌క‌రిస్తున్న‌ట్లు నిఘావ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయుధాల పంపిణీకి పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీఓకే)లో ఉగ్ర‌వాద సంస్థ అల్ బ‌ద‌ర్‌-తాలిబ‌న్ క‌మాండ‌ర్ హ‌మీద్‌ఖాన్ రే భారీ డంప్ ఏర్పాటు చేసిన‌ట్లు గుర్తించారు.

క‌శ్మీర్‌కు డ్రోన్ల ద్వారా ఆయుధాల‌ను పంపేందుకు అన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. లాంచ్‌ప్యాడ్‌లో ప్ర‌యోగానికి 70 మందికిపైగా ఉగ్ర‌వాదులు హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించింది.

గురేజ్‌, కంజిల్వాన్ నుంచి 13 మంది ఉగ్ర‌వాదులు చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించ‌వచ్చ‌ని తెలిపాయి. ఇందులో ఎనిమిది ల‌ష్క‌రే తొయిబా ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు స‌మాచారం అందించాయి. క‌శ్మీర్‌లోని ఉరీలో ప్ర‌వేశించేందుకు మూడు బృందాలు సిద్ధంగా ఉన్న‌ట్లు హెచ్చ‌రించాయి. ఉగ్ర‌వాదుల చొరబాటుకు పాక్ సైన్యం స‌హ‌రిస్తున్న‌ట్లు తెలిపాయి.