ఇకనుండి పోలీస్ స్టేషన్ బెయిల్ రద్దు

పోలీసు శాఖలో అవినీతిని అరికట్టడానికి కేంద్ర న్యాయ శాఖ సిఆర్‌పిసి 41ఎ ను సవరించి, పోలీస్ స్టేషన్ బెయిల్‌ను రద్దు చేసింది. ఇక నుంచి కోర్టుల. ద్వారా మాత్రమే బెయిల్స్ మంజూరు చేస్తారు. దీనికి సంబంధించి *గెజిట్ నోటిఫికేషన్* కూడా జారీ చేశారు.

ఇప్పటి వరకు నిందితులకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించబడే కేసులలో పోలీస్ స్టేషన్లో జామీను పై బెయిల్ ఇచ్చే అవకాశం ఉండేది. ఈ బెయిల్ ఇచ్చే నెపంతో పోలీస్‌స్టేషన్ల లో బాధితులను దోచుకుంటున్నారని, నేరస్తులకు ఈ వెసులుబాటు విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయన్న తీవ్రమైన ఆరోపణలు దేశంలో అనేక ప్రాంతాలలో పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే 41ఎ సీఆర్పిసి సవరణ పై కేంద్రం న్యాయశాఖ దృష్టి సారించింది. కాగా చిన్న కేసులను పరిష్కరించడానికి కోర్టులకు సమయం ఉండకపోవచ్చని ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తమవుతున్నది.

ఏదేమైనా, ప్రతి కేసులో నిందితులు బెయిల్ కోసం కోర్టులను సంప్రదించవలసి ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం పోలీస్ స్టేషన్ అధికారి కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది.