నేర నియంత్రణ పట్ల యోగి ధృడ సంకల్పం 

వికాస్ సరస్వత్

జులై 2 ఉదయం ఎనిమిది మంది యుపి పోలీసుల మరణానికి దారితీసిన కాన్పూర్ కాల్పులకు కారణమైన వికాస్ దూబే ను హతమార్చడం చివరకు దారుణమైన నేర చరిత్రలో కొన్ని సమాంతరాలకు ముగింపు పలికిన్నట్లయింది.

ఈ రక్తపాతం శాంతిభద్రతల పట్ల కఠినంగా వ్యవహరించే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు పెను సవాల్ గా మారగా, యుపి ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపే అవకాశాలు పెద్దగా లభించని ప్రతిపక్షాలకు ఒక అవకాశం లభించినట్లయింది.

ఉజ్జయినిలో దూబే అరెస్ట్ నుండి కాన్పూర్ శివారులో చంపడం వరకు 24 గంటల లోపుగానే ప్రతిపక్షాల ఆరోపణలు మారుతూ ఉండడాన్ని గమనించాము. జులై 9 వరకు దూబే అరెస్ట్ ను అతనిని కాపాడటం కోసం జరిపిన ఫిక్సెడ్ మ్యాచ్ గా పేర్కొన్నారు.

కానీ అతను చనిపోయిన తర్వాత దానిని నకిలీ ఎన్కౌంటర్ అంటూ విమర్శలు ప్రారంభించారు. పైగా, ఈ ఎన్కౌంటర్ కు వికారమైన కులం రంగు పూసే ప్రయత్నాలు చాలామంది కాంగ్రెస్ నాయకులు చేశారు.

2014నాటి సుప్రీం కోర్ట్ మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రతి పోలీస్ ఎన్కౌంటర్ పై మెజిస్టీరియల్ దర్యాప్తు జరుపవలసి ఉంటుంది. దూబే మరణంపై కూడా ఆ విధంగా జరుగుతుంది. అయితే విచారణ ప్రారంభం కాక ముందే కొన్ని అంశాలు నిర్ధారణకు గురయ్యాయి.

శాంతిభద్రతల పరిరక్షణ పట్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిబద్దత వెల్లడైనది. అంతకు ముందు కాలం నాటి సంఘటనలను విస్మరించడానికి కొందరు ప్రయత్నం చేసినా, దూబే, అతని ముఠా పట్ల యుపి పోలీసులు వ్యవహరించిన తీరు గమనిస్తే ప్రస్తుత ప్రభుత్వం మతపర గూండాలను గాని, లేదా కులపరమైన ముఠాలను గాని సహింపబోదని వెల్లడైనది.

సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల ద్వారా ప్రదర్శించిన మతోన్మాదంగాని లేదా నేరస్థ మాఫియాలు గాని .. అన్ని రకాల నేరాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ముఖ్మంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా ప్రదర్శించారు.

చాలాకాలం తర్వాత ఉత్తర ప్రదేశ్ లో సమగ్ర అభివృద్ధి ప్రణాలికను ముఖ్యమంత్రి రూపొందించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మొదటి అడ్డంకి శాంతిభద్రతలని ఆదిత్యనాథ్ గ్రహించారు. అందుకనే నేరాలు, నేరస్థుల పట్ల వ్యవహరించే విషయంలో యుపి పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 

దానితో మెరుగైన పరిస్థితులను జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్ సి ఆర్ బి) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుపిలో 2017 నుండి 2019 వరకు బందిపోట్లు  53.7 శాతం, దోపిడీలు 14.5 శాతం, హత్యలు 33.06 శాతం తగ్గిన్నట్లు వెల్లడి చేస్తున్నాయి. 

అదే సమయంలో ఫిర్యాదుల నమోదు సంఖ్య గణనీయంగా పెరిగింది. వికాస్ దూబే పై పదేళ్ల తర్వాత, బిజెపి అధికారంలోకి వచ్చాక మాత్రమే 2017లో కేసు నమోదు కావడం గమనార్హం. 2007 నుండి 2017 వరకు ఎస్పీ, బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు అతనిపై ఒక్క కేసును కూడా నమోదు చేయలేదు. 

ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు కులం, మతం పేరుతో ఓటర్లను సమీకరించే నేరస్థులు, మాఫియా డాన్ లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. నూతన అభివృద్ధి రాజకీయాలను ఆవిష్కరిస్తూ ఉండడంతో వికాస్ దూబే వంటి వారిని హతమారిస్తే, అజాం ఖాన్ వంటి వారిని జైళ్లలో ఉంచితే తమ ఎన్నికల రాజకీయాలకు ముప్పని భయపడుతున్నారు. 

వికాస్ దూబే బ్రాహ్మణ కులంను అడ్డు పెట్టుకొని ఈ రెండు ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ యుపిలో బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. ప్రియాంక గాంధీ నానమ్మ పోలికలను చూపి ఓట్లు పొందలేక పోవడంతో నేరస్థుల కులం చూపే పొందే వ్యూహం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది.  

ఈ సందర్భంగా అనుసరించిన పక్రియను పౌర సమాజం ప్రశ్నించే అవకాశం కలిగినా, తమ పార్టీలలో నేరస్థులను ప్రోత్సహించిన రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొనే ప్రయత్నం చేస్తూ శాంతిభద్రతల గురించి మాట్లాడటం ఏవగింపు కలిగిస్తుంది. 

ఈ సంఘటనపై ఈ పార్టీలు రొమ్ము చరుచుకోవడం పట్టించుకోకుండా దూబే ఎన్కౌంటర్ ద్వారా తనకై తాను కఠినమైన పరిపాలకుడినని యోగి ఆదిత్యనాథ్ మరోసారి నిరూపించుకున్నారు. సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరులకు దూబే ఎన్కౌంటర్ వాస్తవికత చర్చనీయాంశంగా కూడాలేదు. అధికార దుర్వినియోగంపై పాల్పడుతున్నవారు ఆహాకారాలు చేస్తుంటే సాధారణ పౌరులు సురక్షితంగా భావిస్తుంటారు.