సోనియా గాంధీ కుటుంభ ట్రస్ట్ లపై విచారణ 

సోనియా గాంధీ కుటుంభంకు చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం ప్రభుత్వ ‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోం శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్‌ చేశారు. 
 
రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమొరియల్‌ ట్రస్ట్‌కు చెందిన విదేశీ వివరాలు, ఆదాయపన్ను ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు అంతర్ మంత్రిత్వశాఖల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 
 
ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్‌ట్యాక్స్‌, ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ యాక్ట్‌ ఉల్లంఘనలు చేశారని, అందుకే విచారణ చేపడుతున్నామని హోం శాఖ అధికారులు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ప్ర‌త్యేక డైరెక్ట‌ర్ ఇంట‌ర్ మినిస్టీరియ‌ల్ క‌మిటీకి నేతృత్వం వ‌హిస్తార‌ని హోంశాఖ తెలిపింది. 
 
1991 జూన్‌లో ప్రారంభించిన రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, 2002లో ప్రారంభమైన రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌కు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆర్‌జీఎఫ్‌కు చైర్మ‌న్‌గా ఉన్న సోనియాగాంధీ ఇందుకు బాధ్యురాల‌ని న‌డ్డా మండిప‌డ్డారు. రాజీవ్‌గాంధీ ఫౌండేష‌న్‌కు సోనియాగాంధీ చైర్మ‌న్‌గా ఉండ‌గా.. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, పీ చిదంబ‌రం, మ‌న్మోహ‌న్ సింగ్ స‌భ్యులుగా ఉన్నారు.    
 
యూపీఏ హ‌యంలో ఆప‌ద‌లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించిన ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్  (ఆర్‌జీఎఫ్‌)‌కు విరాళం ఇచ్చార‌ని బీజేపీ అధ్య‌క్షుడు జెపి  న‌డ్డా ఆరోపించారు. పీఎంఎన్‌ఆర్‌‌ఎఫ్‌ ఏవైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఇవ్వడానికి గాని, ట్రస్ట్‌లకు ఇచ్చేందుకు కాదని చెబుతున్నారు.
1991లో అప్పటి ఆర్ధిక మంత్రి ‌‌ మన్మోహన్‌సింగ్‌ కూడా బడ్జెట్‌ ప్రసంగంలో రాజీవ్‌ గాంధీ ట్రస్ట్‌కు రూ 100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారని బీజేపీ ఆరోపించింది.