జివికె గ్రూప్ పై రూ 850 కోట్ల కుంభకోణం కేసు 

జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జి  వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 850 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడిన ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఎఎల్‌)కు  ఛైర్మన్ గా ‌ వెంకట కృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. సిబిఐ దాఖలు చేసిన ఈ కేసులో విమానాశ్రయ అథారిటీ ఆఫ్‌ ఇండియా (వివిఐ)తో పాటు మరో తొమ్మిది ప్రైవేట్‌ సంస్థలు ఉన్నాయి.

2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ 310 కోట్లను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది. 

జీవీకే గ్రూప్ ఛైర్మన్ అయిన వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీ సంజయ్ రెడ్డిలతోపాటు మియాల్, జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.  

జివికె వద్ద 50.5 షేర్లు ఉండగా, ఎఎఐ వద్ద 26 శాతం షేర్లు ఉన్నాయి. 2006లో ఎఎఐ,  ఎంఐఎల్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ఎంఐఎల్‌ ముంబయి విమానాశ్రయాన్ని నడుపుతుందని, వారు తమ ఆదాయంలో 38.7 శాతం ఎఎఐతో వార్షిక రుసుముగా పంచుకున్నాయని సిబిఐ పేర్కొంది.

2017-2018 మధ్య ముంబయి విమానాశ్రయం చుట్టూ 200 ఎకరాలను రియల్‌ఎస్టేట్‌గా అభివృద్ధి చేసినట్లు తప్పుడు లెక్కలు నమోదు చేశారని సిబిఐ పేర్కొంది.