వైసిపి అధికార ప్రతినిధా! ప్రభుత్వ సలహాదారా!

అజల్ కల్లాం గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారా! అధికార ప్రతినిథా! కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రులు గాని, వైసిపి నేతలు గాను మారుమాట్లాడకుండా, ప్రభుత్వ సలహాదారునిగా వ్యవహరిస్తున్న మాజీ ప్రభుత్వ కార్యదర్శి అజయ్ కల్లమ్  స్పందించడం విస్మయం కలిగిస్తున్నది. 

పైగా, గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడానికి ప్రభుత్వ పెద్దలు ఎవ్వరు లేన్నట్లు ఆయనను ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆమె రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ విధానాన్ని తప్పు బట్టారు. అందుకు సమాధానం ఇవ్వడానికి విద్యుత్ మంత్రి అంటూ లేరా? 

కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని బీజేపీ నేత పాతూరి నాగభూషణం ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా చూడటం సరి కాదని హితవు చెప్పారు. 

ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని… దమ్ముంటే వైసీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవంటే.. అది కేంద్రం అమలు చేస్తున్న విధానాల వల్లే అని ఆయన చెప్పుకొచ్చారు. 

రోనా కష్టకాలంలో ప్రజలు ఉంటే రెండు, మూడు నెలల  బిల్లును ఒకేసారి ఇచ్చి  శ్లాబు పెంచి వసూలు చేశారని నాగభూషణం ఆరోపించారు.