భారత్‌కు అండగా అమెరికా సైన్యాలు

చైనా సైన్యం నుంచి ఎదురౌతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌తోపాటు ఆసియా దేశాలకు అండగా తమ సైనాన్ని పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులను సిద్దం చేస్తామని బ్రస్సెల్స్‌ ఫోరంనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేసారు.

జర్మనీలో అమెరికా బలగాలను 52 నుంచి 25వేలకు తగ్గిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ కోరిక మేరకు సైనికల బలగాల సమీక్షను నిర్వహిస్తామని పాంపియో చెప్పారు. నిర్ధిష్ట ప్రాంతంలో తమ బలాగాలు ఉన్నాయన్న ఆయన భారత్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలకు చైనా నుండి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. 
 
ఏ ప్రాంతానికైనా ముప్పు వాటిల్లితే ఇతర దేశాలు బాధ్యత తీసుకొని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని  పేర్కొన్నారు. భారత్‌, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పాంపియో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని తెలిపారు.