హోమ్‌ క్వారంటైన్ రోగులను గాలికే 

తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా గాంధీ ఆసుపత్రిలో చేరడాన్ని నిరుత్సాహ పరుస్తూ వందల సంఖ్యలో కరోనా రోగులను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. అయితే హోమ్‌ క్వారంటైన్ కు పంపిన తరవాత తమను పట్టించుకోకుండా గాలికి వేదిలివేస్తున్నట్లు చాలామంది రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఎసింప్టమాటిక్, మైల్డ్ సిప్టమాటిక్ వ్యక్తులను హోమ్ ఐసోలేషన్‌‌లో ఉండనివ్వొచ్చని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఇందుకు కొన్నినిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, తెలంగాణలో ఎటువంటి నిబంధనలను ‌ పాటించకుండానే వందల మందిని హోమ్ ఐసోలేట్ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం 3వేల మంది రోగులు మ్ ఐసోలేషన్‌‌లోనే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వెంటనే సింప్టమ్స్ లేకుంటే హోమ్‌ ఐసోలేషన్‌‌లో ఉండాలని చెబుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థి తి ఏమిటీ? ఇతర జబ్బులేమైనా ఉన్నాయా? ఇంట్లో ఐసోలేషన్ లో ఉండే సదుపాయం ఉన్నదా లేదా అనే అంశాలను కూడా పట్టించుకోవడం లేదు. 
 
చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఉన్నఇంట్లో కరోనా పేషెంట్లను ఐసోలేట్ చేయడం ప్రమాదమని తెలిసినా, అధికారులు అవేమీ పట్టించుకోవడంలేదు. 
 
ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌‌లో ఉన్న వ్యక్తిని చూసుకునేందుకు కుటుంబంలో ఒక సభ్యుడిని నియమించాలి. అతను పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి. వైరస్ సోకకుండా ఆ వ్యక్తికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ‌ట్యాబ్లెట్స్ ‌ఇవ్వాలి. కానీ, చాలా మందికి ఈ ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదు. కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా అందించడం లేదు. 
 
తొలుత కంటైన్‌‌మెంట్ జోన్లలో వందల ఇండ్లకు సరుకులు పంపించిన అధికారులు, ఇప్పుడు పాజిటివ్ వ్యక్తులకు ఎలాంటి సహాయం చేయడం లేదు. వైరస్ భయంతో తెలిసిన వాళ్లు కూడా సాయం చేసేందుకు వెనకాడుతున్నారు.