600 చైనా చొరబాట్లకు  మన్మోహన్  అధ్యక్షత 

గాల్వాన్ ఘటనపై మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. భారత దేశానికి చెందిన వందల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు దయతో అప్పగించారని ఆయనపై నడ్డా మండిపడ్డారు. అంతేకాకుండా 2010 -2013 మధ్య పొరుగు దేశం చేసిన 600 చొరబాట్లకు ఆయన అధ్యక్షత వహించారని ఆరోపించారు.

చైనా విషయంలో కాంగ్రెస్ పదే పదే ప్రధాని మోదీని దుమ్మెత్తి పోస్తోందని, మొదట జవాన్లను పదే పదే అవమానించడం, వారి శౌర్యాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్ మానుకోవాలని హితవు చెప్పారు. 

చైనాకు నిస్సహాయతతో 43,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ధారాదత్తం చేసిన పార్టీ నాయకుడు. యూపీఏ ఏలుబడిలో ఎలాంటి పోరాటాలు, వ్యూహం ఆచరించకుండానే  లేకుండానే చైనాకు లొంగిపోవడం చూశాం అంటూ విరుచుకు పడ్డారు. 

“వందల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పగించిన సమయంలో మన్మోహన్ చైనా డిజైన్ల గురించి ఆందోళన పడ్డారు. 2010 నుంచి 2013 సంవత్సరాల మధ్య కాలంలో 600 చొరబాట్లకు ఆయన అధ్యక్షత వహించారు’’ అని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.