చైనాలో ప్రధాని మోడీ వెబ్ సైట్ బ్లాక్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక వెబ్ సైట్ ను చైనా బ్లాక్ చేసిన్నట్లు కనబడుతున్నది. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెబ్ సైట్ ను మాత్రం ఏమీ చేయలేదు.

తమ దేశంలోని ఇంటర్ నెట్ వినియోగాన్ని పెద్ద ఎత్తున నియంత్రిస్తూ, సెన్సార్ చేయడం చైనా చేస్తుంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా లేదా దేశ ప్రయాజనాలకు భిన్నంగా ఉన్నదని భావించే ఏ వెబ్ సైట్ నైనా లేదా లింక్ నైనా బ్లాక్ చేయడం చేస్తుంటుంది. అటువంటి నియంత్రణలను లేదా సాంకేతికపర సెన్సార్ షిప్ లను `ది గ్రేట్ ఫైర్ వాల్ అఫ్ చైనా’  అని అంటుంటారు.

మొత్తం ప్రపంచంలోనే ఇంత భారీగా ఇంటర్ నెట్ ను మరే దేశం సెన్సార్ చేయడం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం పలు సాధనాలను ఉపయోగించి పెద్ద సంఖ్యలో విదేశీ వెబ్ సైట్ లను, ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా పోర్టల్ లను, సెర్చ్ ఇంజిన్ లను బాక్ చేస్తుంతుంది.

చైనాలో ఒక వెబ్ సైట్ ను లేదా లింక్ ను బ్లాక్ చేశారా లేదా తెలుసుకోవడానికి ఇంటర్ నెట్ లో బహిరంగంగా లభించే అనేక సాధనాలున్నాయి. వాటిని `చైనీస్ ఫైర్ వాల్స్ టెస్ట్స్’  అని పిలుస్తుంటారు.

లడఖ్ వద్ద గాల్వాన్ వాలీ లో చైనా జరిపిన దురాక్రమణతో భారత్ – చైనాల మధ్య ఉద్రిక్తలు పెరగడంతో ఈ సాధనాలను ఉపయోగించి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సైట్ లను పరిశీలించగా ఈ అంశం వెల్లడైనది. మోదీ అధికారిక వెబ్ సైట్ ను బ్లాక్ చేసిన్నట్లు, రాహుల్ గాంధీది  మాత్రం చైనాలో కొనసాగుతున్నట్లు తేలింది.

ప్రధాని మోదీ వెబ్ సైట్ ను టెస్ట్ చేయగా “మీ సైట్ చేరుకోవడానికి ఏ సర్వర్ లభించడం లేదు. అంటే మీ సైట్ చైనా ప్రధాన భూభాగంలో అందుబాటులో ఉండే అవకాశం లేదు” అనే సమాధానం వస్తున్నది.