ఫేక్ వీడియో పోస్ట్‌లో దిగ్విజయ్‌ పై ఎఫ్‌ఐఆర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు పలు సెక్షన్స్‌ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌పై ఓ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు దిగ్విజయ్‌ మీద బీజేపీ కేసు పెట్టింది. 
 
దీనికి సంబంధించి మెమొరాండమ్‌ను భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు బీజేపీ మాజీ మంత్రి ఉమాశంకర్ గుప్తా అందించారు. లిక్కర్ పాలసీపై శివరాజ్ సింగ్ ఇచ్చిన పాత స్టేట్‌మెంట్‌పై ఎడిటింగ్ వీడియోను దిగ్విజయ్ షేర్ చేశారని ఆరోపించారు.
 
‘సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌ పేరును దెబ్బ తీసేందుకు ఆయనకు సంబంధించిన ఓల్డ్ వీడియోను ఎడిటింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. సైబర్‌‌ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం’ అని భోపాల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఇర్షాద్ వలీ ట్వీట్ చేశారు.