జూమ్ వెనుక చైనా అదృశ్య హస్తం!

లాక్ డౌన్ కారణంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలకు విస్తృతంగా ఉపయోగిస్తున్న జూమ్ వెనుక చైనా అదృశ్య హస్తం ఉన్నట్లు ఇప్పుడు బహిర్గత మైనది. చైనా ప్రభుత్వ ప్రమేయంతో కొందరు మానవ హక్కుల ఉద్యమకారుల ఖాతాలను రద్దు చేయడం, అంతే కాదు బీజింగ్ పై ఆరోపణలు చేసే మరెటువంటి సమావేశాలు జరిపినా వారి ఖాతాలు కూడా రద్దు చేస్తామని సంకేతం ఇచ్చింది.

భారత హోమ్ మంత్రిత్వ శాఖతో పాటు పలు దేశాలు జూమ్ లో సమాచార భద్రత పట్ల ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం చేశాయి.  అమెరికా కంపెనీ అయినప్పటికీ చైనా ప్రభావంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశాయి.

పాశ్చాత్య దేశాల ప్రాతిపదికగా గల ట్విట్టర్, పేస్ బుక్ వంటి అనేక సోషల్ మీడియా వేదికలను తమ దేశంలో నిషేధించిన చైనా జూమ్ ను మాత్రం నిషేధించక పోవడం గమనార్హం. పైగా చైనా వెలుపల చైనా గురించి జూమ్ లో జరిపిన సమావేశాలు ఏ విధంగా చట్ట వ్యతిరేకమైనవో ఆయా అకౌంట్ లను రద్దు చేసే ముందు జూమ్ వివరణ ఇవ్వక పోవడం గమనార్హం.

గత వారం  తియాన్మెన్    స్క్వేర్వా నరమేధం ర్షికోత్సవం సందర్భంగా  లేదా హాంగ్ కాంగ్ లో సంక్షోభం గురించి చర్చించడం కోసం  లైన్ లో జూమ్ ద్వారా కార్యక్రమాలు జరప తలపెట్టిన ముగ్గురి ఖాతాలను రద్దు చేసింది.

తియాన్మెన్ స్క్వేర్ నరమేధం గురించి సమావేశాలు జరపబోతున్నట్లు నలుగురు సోషల్ మీడియా లో ప్రకటించారని చైనా ప్రభుత్వం మే, జూన్ ప్రారంభంలో తమకు తెలిపినది జూమ్ ప్రకటించింది. అంటే చైనా ప్రోద్బలంతోనే వారి అకౌంట్ లను రద్దు చేసిన్నట్లు అంగీకరించిన్నట్లు  అయింది.

“ఈ సమావేశాలు చట్ట వ్యతిరేకం అని చైనా ప్రభుత్వం తెలిపినది. వారి సమావేశాలను, నిర్వహించే వారి అకౌంట్ లను రద్దు చేయమని కోరింది” అని చెప్పింది. అమెరికాలో, హాంగ్ కాంగ్ లో ఉంది సమావేశాలు జరపబోతున్న వారి అకౌంట్ లను చైనా కోరితే ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో జూమ్ వివరణ ఇవ్వలేదు.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న చైనా ఉద్యమకారుడు జహౌ ఫెంగ్ సువో ఖాతాను తియాన్మెన్ గురించి కార్యక్రమం జరపగానే రద్దు చేశారు. హాంగ్ కాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూల ప్రచారం చేస్తున్న లీ చేయూక్  యాన్ గత ఏడాదిగా నగరంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు కారణమైన వివాదాస్పద అప్పగించే చట్టం గురించి ఒక కార్యక్రమం నిర్వహించే ముందు తన ఖాతాను రద్దు చేసిన్నట్లు గుర్తించాడు.

“ఇది అవమానకరమైన రాజకీయ సెన్సార్ షిప్” అంటూ విమర్శించాడు. “వారు నా ఖాతాను తిరిగి తెరిచినా జూమ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ముందు సాగిలపడుతున్నది” అంటూ మండిపడ్డాడు.

అమెరికా నుండి పనిచేస్తున్న మరో ఉద్యమకారుడు వాఙ్గ్  డాన్ జూమ్ ఖాతాను జూన్ 3న తియాన్మెన్   స్క్వేర్ పై కార్యక్రమం తలపెట్టగా రెండు సార్లు అతని ఖాతాను రద్దు చేశారు. “చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యంపై క్రియాశీలకంగా దాడు చేస్తున్నది. ఇప్పటికే అమెరికా సామజిక విధానం, జీవన విధానంలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. మొత్తం ప్రపంచం అప్రమత్తం కావలి” అంటూ హెచ్చరించాడు.

అసలు జూమ్ కంపెనీ ఏ విధంగా పనిచేస్తుందో వివరణ ఇవ్వాలని కోరుతూ అమెరికా ప్రజా ప్రతినిధులు గ్రెగ్ వాల్డెన్, కాథీ మాక్ మోరిస్ రొడ్గేర్స్ జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ కు లేఖ వ్రాసారు. “అమెరికా సూత్రాలు, స్వేచ్ఛ ప్రసంగం కావాలా లేదా అడ్డ దారిలో ప్రపంచ లాభాలు, సెన్సార్ షిప్ కావాలో తేల్చుకోండి” అంటూ యువాన్ ను అమెరికా సెనెటర్ జోష్  హ్వాల్య్ ప్రశ్నించారు.