తెలంగాణలో మూడొంతుల కేసులు హైదరాబాద్ లోనే 

గ్రేటర్  హైదరాబాద్ లో కరోనా వైరస్ అదుపు తప్పుతున్నది. నిత్యం 100 నుంచి 200 వరకు కేసులు నమోదవుతూ ఉండడంతో అందరిలో  ఆందోళన చెలరేగుతుంది. తమ గల్లీలోనో, డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనో కరోనా వచ్చిందని తెలియగానే మరింత ఖంగారు పాడన్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడికి ప్రభుత్వం, బల్దియా నిర్లక్ష్యం, పరిస్థితిని అంచనా వేయకపోవడమే కారణాలుగా కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలోని మూడొంతుల కేసులు హైదరాబాద్ లోనే ఉండడం గమనార్హం. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133 నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,484 కేసులుంటే, వాటిల్లో 3,200కు పైగా గ్రేఆర్ హైదరాబాద్ లోనే ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండడం తీవ్రతను తెలుపుతోంది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 174కు చేరింది.

సాధారణంగా అర్రోగ్య శాఖ ప్రతి రోజు విడుదల చేసే నివేదికలలో  పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులున్న చోట జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్లు ఏర్పాటు చేసి నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ చాలా ఏరియాల్లో అలాంటి చర్యలే వీ తీసుకోవడం లేదు. 

ఏ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్ని కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయో కూడా అధికారులు చెప్పడం లేదు. క్షేత్రస్థాయిలో నిర్వహణ సక్రమంగా లేకపోవడమే అందుక్కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఒకరకంగా కరోనాను గాలికి వదిలివేసిన్నట్లు కనిపిస్తున్నది. అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే ట్ కు చెందిన వ్యక్తికి 4రోజుల కిందట పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తే ఆయన ఇంటిని కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. టెస్టులు చేసేందుకు ఎవరూ రాలేదు. 

కరోనాకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా మారిన జియా గూడలో 5 రోజుల కిందట ఒకరు కరోనాతో చనిపోగా, ఆ కుటుంభం సభ్యులకు టెస్ట్ లు చేయలేదు. ఇంట్లోవాళ్లు మామూలుగానే బయటకు వచ్చిపోతున్నారు. స్థానికంగా డిస్ ఇన్ ఫెక్టీవ్  కూడా చేయకపోవడం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు  అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిబంధనలు మారుస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది గందరగోళానికి గురవుతున్నా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు. ప్రస్తుతం ప్రైమరీ కాంటాక్ట్స్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయడం లేదు. ఏప్రిల్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసి ఆపివేశారు. విమర్శలు రావడంతో మళ్లీ కొనసాగించినా, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.