10 పరీక్షలు వద్దు… ప్రమోట్ చేయండి: బీజేపీ

కరోనా మహమ్మారి  దృష్ట్యా తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుపకుండా రాష్ట్ర హై కోర్ట్ సూచనను పరిగణలోకి తీసుకొంటూ అంతర్గత పరీక్షలలో మార్కుల ఆధారంగా వారిని ప్రమోట్ చేయాలని బీజేపీడిమాండ్ చేసింది. 
 
రాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత పరిష్టితులలో పరీక్షలు అంటే విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారని బిజెపి ఎమ్యెల్సీ, హైదరాబాద్ నగర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. 
 
ఈ విషయంలో పరీక్షలు జరుపకుండా 10వ తరగతి విద్యార్థులను ప్రోమోట్ చేసిన పంజాబ్ వంటి ప్రభుత్వాలను కేసీఆర్ ప్రభుత్వం అనుసరించాలని ఆయన సూచించాహరు. 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయడం పట్ల హర్షం ప్రకటిస్తూ విద్యార్థులు పరీక్షలు వ్రాయడానికి ప్రస్తుత పరిస్థితులలో మానసికంగా సిద్ధంగా లేరని చెప్పారు. 
 
కాగా, ఇంటర్మీడియట్ పరీక్షా పేపర్లు దిద్దడానికి వస్తున్న అధ్యాపకులకు, ముఖ్యంగా వికారాబాద్, చేవెళ్ల, హయత్ నగర్ వంటి ప్రదేశాల నుండి వస్తున్నవారికి ప్రభుత్వమే రవాణా చార్జీలు భరించాలని రావు డిమాండ్ చేశారు. 
 
వాల్యుయేషన్ కేంద్రాలకు ఆర్ టి సి బస్సు లలో వస్తున్నవారి నుండి రవాణా చార్జీలకు కొత్త విధించాలని విద్యాశాఖ జూన్ 5, 6 తేదీలలో జారీచేసిన ఉత్తరువులు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. 
 
వాల్యుయేషన్ కోసం వస్తున్న అధ్యాపకులకు మాస్క్ లు, శానైటీజర్లను కూడా సరఫరా చేయడంలేదని రామచంద్రరావు విచారం వ్యక్తం చేశారు.