వృద్దులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు 

65 ఏళ్లుపైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని పేర్కొంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీచేసింది. లాక్‌డౌన్‌ 4.0 ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుతం లాక్‌డౌన్‌ 5.0 ను ఈ నెల 30 వరకు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని సడలింపులూ ఉంటాయని తెలిపింది. 

రాయితీ ఈ విషయమై వారం రోజులవరకు మౌనంగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మార్గదర్శకాలు 
* కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. ఆహారం పార్శిల్‌ తీసుకువెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* 65 ఏళ్లుపైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు.
* కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి.
* షాపింగ్‌ మాల్స్‌లో ఎయిర్‌ కండీషన్‌ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషిద్ధం.
* అనుమతి ఉన్న షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు డిజిటల్‌ చెల్లింపులు, ఈ-వ్యాలెట్‌ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
* షాపింగ్‌ మాల్స్‌ ప్రాంగణాలు, పార్కింగ్‌ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
* ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
* హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతిసారీ శానిటైజ్‌ చేయాలి.
* గేమింగ్‌ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసి ఉంచాలి.
* షాపింగ్‌ మాల్స్‌లోని సినిమా హాళ్లు తెరవకూడదు.


దేవాలయాల్లో 
* దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలకు అనుమతి.
* ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్‌ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై కొనసాగనున్న నిషేధం.
* దేవాలయాల వద్ద విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా దర్శనం చేసుకోవాలి.
* తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలాలను భక్తులపై చల్లడం నిషేధం.
* సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
* ప్రార్థనా మందిరాల్లో ఎవరికి వారు కింద కూర్చునే వస్త్రం లేదా తివాచీ తెచ్చుకోవాలి.